![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1099 లో.. రాజు భోజనం చేస్తుంటే ఇందు వడ్డిస్తుంది. అప్పుడే స్వాతి వస్తుంది. అక్క ఐశ్వర్య నువ్వు వద్దన్న వెళ్ళిందని చెప్తుంది. కార్ కీస్ తీసుకున్నావ్ కదా ఎలా వెళ్లి ఉంటుందని రాజు అనగానే లక్కీ తీసుకొని వెళ్ళాడని స్వాతి చెప్తుంది. ఇందు కోపంగా రాజు వంక చూస్తుంది. వాడేదో లిఫ్ట్ ఇచ్చి ఉంటాడని రాజు చెప్తాడు. మరొకవైపు ఐశ్వర్య కోసం శశి వెయిట్ చేస్తాడు. అప్పుడే లక్కీ బైక్ పై ఐశ్వర్య వస్తుంది. ఐశ్వర్య వెళ్లి శశిని హగ్ చేసుకుంటుంది. దాంతో లక్కీకి కోపం వస్తుంది. అతనెవరని శశి అడుగుతాడు.
నేను తన ఫ్రెండ్ ని లక్కీ అనగానే అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా అని శశి అనగానే ఫ్యామిలీ ఫ్రెండ్ అని లక్కీ చెప్తాడు. వాళ్ళు క్లోజ్ గా ఉంటే లక్కీ అసలు చూడలేకపోతాడు. ఆ తర్వాత ఐశ్వర్య ఫుల్ గా తాగి ఇంటికి వస్తుంది. ఒసేయ్ ఇందు బయటకు రావే అని అంటుంది. అందరు బయటకు వస్తారు. ఈ రాజు, ఇందు పెళ్లి చేసుకోలేదు అంటే మా రేఖ ఆంటీ వినట్లేదు.. ఇదొక పిచ్చిది అంటు రేఖని తిడుతుంది. అందరిని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. అందరు సైలెంట్ గా ఉంటారు. ఏంటి రేఖ.. అది అంత మాట్లాడుతుంటే సైలెంట్ గా ఉన్నావని భ్రమరాంబ అంటుంది. అయినా రేఖ వినిపించుకోదు. ఆ తర్వాత తాగిన వాళ్ళు నిజాలు మాట్లాడుతారు అంటారు కదా.. ఇప్పుడు ఈ ఐషు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందని శేషుతో భ్రమరాంబ అంటుంది.
ఆ తర్వాత రేఖ దగ్గరికి భ్రమరాంబ వచ్చి ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. నా టెన్షన్ నాకు ఉంటుంది కానీ మీరు ఎందుకు వచ్చారని రేఖ అడుగుతుంది. ఇందు , రాజు పెళ్లి గురించి ఐషు చెప్పింది నిజమే అనిపిస్తుంది.. వాళ్లకి పెళ్లి కాలేదనిపిస్తుంది అని భ్రమరాంబ అనగానే వాళ్ళు అంత బాగున్నారు నీకెందుకు డౌట్ వస్తుంది.. అవన్నీ ఆలోచించడం మానెయ్ అని రేఖ చెప్పి వెళ్తుంది. అంత ఈజీగా వదిలేస్తానా అని ప్రతీ మూమెంట్ ఇక వాళ్ళని అబ్జర్వ్ చేస్తానని భ్రమరాంబ అనుకుంటుంది. ఆ తర్వాత ఐశ్వర్య గురించి ఇందు టెన్షన్ పడుతుంది. తరువాయి భాగంలో రాజు ఇందు వేరువేరుగా పడుకోవడం అపర్ణ చూస్తుంది. వాళ్ళిద్దరు నిజంగా పెళ్లి చేసుకున్నారా లేదా అని సత్యనారాయణ వ్రతం చేస్తే తెలిసిపోతుందని అపర్ణ, సుభాష్ అనుకొని ఇందుకి చెప్తారు. రాజుకి ఇందు చెప్తుంది. నేను దేవుడి విషయంలో మోసం చెయ్యలేను పూజకి రానని రాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |